కొన్ని తప్పవు
తప్పదు
కొన్ని క్షణాలకు కొన్ని క్షణాలు వారధి కట్టాల్సిందే
కొన్ని స్థితులకు కొన్ని పరిస్థితులు మూలం అవ్వాల్సిందే
తెలియజేయడానికి కారణం ఏదైనా కావచ్చు
కొన్ని ప్రశ్నలు ప్రశ్నల్లా ఉండిపోవాల్సిందే !
తప్పదు
వానచుక్కలు కురుస్తున్న గుండె లోగిలిలో
మాదిరి పంచదార చినుకులు ఉనికి కనబడల్సిందే !
మంచపు కోళ్ళను అనుకున్న దోమతెరే కావచ్చు
నన్నేమి చెయ్యలేవనే ధైర్యం చూపాల్సిందే !
తప్పదు
విశాలమైన ఉద్యానవనం లో పువ్వులు గట్టి కాపలా లో ఉన్నా
మట్టి రేణువుల సువాసనతో చిద్విలాసం చేయాల్సిందే !
జలపాతం ఒడ్డున కూర్చున్న ఆసామి ఎవరైనా కావచ్చు
స్వరపేటిక పై విలువలున్న సంతకంలో అక్షరమై నిలవాల్సిందే !
తప్పదు
విషాదం సముద్రాన్ని అద్దం లా వాడుకున్నా
ప్రతిబింబ చాయలు రైలు పట్టాల్లా దు;ఖించాల్సిందే !
ప్రపంచమంతా అలిగి మూలనున్న ఖాళీ సంచి కావచ్చు
నలుగు పెట్టి స్నానించిన సూర్యుడు భూమిని తాకాల్సిందే !
మనసు మరణించి చాలా కాలమైంది
జయంతులు , వర్దంతులు ఎన్ని జరుపుకుంటున్నా
మనిషి మాటల్లో చేరి జ్ఞాపకంగా మిగిలిపోవచ్చు !
అయినా భూమిపై ఉహించుకుంటూ బతకాల్సిందే !
No comments:
Post a Comment