Thursday, September 8, 2011

నువ్వు-నేను

కదిలిన జీవితాల నడుమ
వేళ్ళాడే ఆకారాలు
ఒకటి మనసు
మరొకటి మనిషి
ప్రవహించే నదుల మధ్య
విరబూసిన అలలు
ఒకటి నిశ్శబ్దం
మరొకటి గంభీరం!
హద్దులు లేక గాలికి ఎగసిపడే
వెండి పాదాలు
ఒకటి చందమామ
మరొకటి నక్ష్యత్ర౦
గడచిన ఇన్నేళ్ళలో
కనిపించిన ప్రాణాలు
ఒకటి నువ్వు
మరొకటి నేను..

2 comments:

  1. నువ్వు-నేను
    ఒకటి మనసు
    మరొకటి మనిషి --bavundi

    ReplyDelete