Monday, December 30, 2013

భావ చిత్రం 

కొత్త నెల 
సరికొత్త సంవత్సరం 
కొత్త నవ్వు 
సరికొత్త దు:ఖం 
కొత్త చలి 
సరికొత్త వేసవి 

పాత మనసు 
మార్పు లేని 
మార్చుకోలేని 
అదే మనిషి తీరు !

బంధాలను కాదని 
ద్వార బంధాలను ముసేస్తున్న 
నూతనత్వపు తేరు !

ముఖాలను దాటి 
ముఖ స్తుతులను అనుసరిస్తున్న 
అంతస్తుల హోరు !

సునితత్వపు  నూనె లేక తుప్పు పట్టి 
కిర్రు కిర్రు మంటున్న హృదయ కవాటాలు !

'మనం ' పదం వినబడక ... 
సమూహం లో ఒంటరై 
ఆనందంగా ఆహ్వానించలేని ఇంటి వాకిళ్ళు !

సఖ్యత మరచిన మనసు లోగిళ్ళు తేలికై 
నేలకొరుగుతున్న నిలువెత్తు కుటుంబ వృక్షాలు !

భావ సంపదను  మరచిన అక్షరాలు 
కనిపించని ఆకుపచ్చని కవికోసం ఎదురుచూస్తూ 
కాలాన్ని బంధించి  కలాలకు సవాలు విసురుతున్న వైనాలు !

మార్పు రాని నూతనత్వం 
నేలపై పడిన నూనె లాంటిది !
ఎంత జాగ్రత్తగా అడుగులు వేసినా 
జారిపడటానికే  అవకాశం ఎక్కువ !
అది సంస్కృతీ సాంప్రదాయాలకే  పెద్ద సవాలు !



6 comments:

  1. lucky to go through you literacy blog. thanks again

    ReplyDelete
  2. "సునితత్వపు నూనె లేక తుప్పు పట్టి
    కిర్రు కిర్రు మంటున్న హృదయ కవాటాలు !" Superbbbbbbbbbbb ....

    ReplyDelete