ప్రయాణం ..
ఒక సుదీర్ఘ ప్రయాణం అనంతరం
ఇక తప్పనిసరి నడకలేవో మిగిలిపోయినట్లు
జీవితం లో గెలుపు కోసం నేను
గుండె నిండా
ఎటూ పాలుపోని ఆలోచనలు ..
విసుక్కున్నా , విరక్తి చెందినా
బతుకంతా చేస్తున్న పోరాటానికి
చివరి ఘడియలు చేస్తున్న చప్పుడికి
జ్ఞాపకంగా నాలో మెరిసిన చిరునవ్వు !
ఎవరిని ఎవరు కాపాడుతున్నారో
ఇంకా ఎందరు కాపాడతారో అర్థం కాని
నా నుదిటిన రూపాయి కాసంత బొట్టు !
అనుభవం వందేళ్ళు చూపుతున్నా
మనసు మారని గడియారం లో పెద్ద ముళ్ళు తత్వం
ముడతలు పడలేని పెండ్యులం నైజం !
హాల్లో గోడ మీద అమ్మ నాన్నలు
నిదుర పట్టక మంచంపై మెసులుతూ నా ఓటమి
పక్కకు తల తిప్పి చూస్తే తెలిసింది
నీడనిచ్చే ఆకాశం తన క్షేమానికై వెదుకుతోందని
నిలుచుండే నేల ఆకాశం వైపు చూస్తోందని ..
ఇప్పుడు భోధ పడింది
దూరాల దిగులు అంతుచిక్కదని.. !
No comments:
Post a Comment