పోస్ట్ మార్టం
తెరచిన కిటికీ వద్ద కూర్చున్న అతను ఒక విషయమై ఉన్నాడు
ఆ కళ్ళు మాత్రం అక్షరాలకు వలయమై ఉన్నాయి
అరుపులు, అమ్మకాల నడుమ బస్సు ధ్వని ఎక్కువగా ఉంది
చూపులు తిప్పి ఒక్కసారిగా ద్రుష్టి సారించాడు
ఆ చూపు ఒక నిశ్శబ్ద దళం లా ఉంది
గమనించిన నా క్షణం హిమ స్వరం లా ఉంది
రాత్రి అంచుల మీది నిద్ర ప్రయాణం తో
సేదతీరిన ఆ కనుల నుండి ఏదో తెలియని భాష కనబడుతోంది
సందిగ్ధం లో నా హృదయం వెలుగు సూది గా మారింది
ఇద్దరి మధ్య బిగిసిన మౌనంతో
స్వప్నం చెదిరి ఒక్కసారిగా మెలకువ వచ్చింది
ఆ పెదవులపై ఇప్పటికీ స్వేఛ్చ శబ్దం వినిపిస్తుంది
ఎలా ఉన్నావు ? అని అడిగితే ఉన్నాను కదాని అర్థం వచ్చేలా
ఆ గళం గ్లాసులోకి పాట జూలు విసిరింది
ఆ చేతిలో న్యూస్ పేపర్ చదవడానికి ఏముంది అన్నట్లు మూసి ఉంది
మళ్ళీ వీధి లోకి మళ్ళీ నిర్లిప్తంగా నా చూపుల ప్రవాహం
నిర్ణయం ఏదైనా పోస్ట్ మార్టం ఖచ్చితం !
ఇంత భగ్న శాంతి లోనూ
నా పాట ను వినే గుండె లేకపోలేదు
నన్ను అనుసరించే ఛాయలు రాకపోలేదు !
No comments:
Post a Comment